నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచర్ల గ్రామంలో శుక్రవారం గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. స్థానిక ప్రజలను పలకరించి వారి సమస్యలపై ఆరా తీశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం 24 గంటలు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.