రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం నెల్లూరు, వేదాయపాలెం రైల్వే స్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. మృతుడి కుడి చేతిపై ఎస్ఎల్ అనే అక్షరాలు, ఎడమ ఛాతిమీద 'ఎస్' అనే అక్షరం పచ్చబొ ట్లుగా ఉన్నాయి. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.