ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం రాత్రి న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వేమిరెడ్డికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి నూతనంగా గెలుపొందిన ఎంపీలందరికీ పవన్ కళ్యాణ్ ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేశారు.