నెల్లూరు నగర వ్యాప్తంగా అవసరమైన అన్ని ప్రాంతాలలో డ్రైను కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని కమిషనర్ వై. ఓ నందన్ ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. గురువారం నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా సీసీ రోడ్లు, డ్రైను కాలువల నిర్మాణ ఆవశ్యకతను కమిషనర్ కు ప్రత్యక్షంగా విన్నవించారు.