అందరికీ ఇళ్ళు పథకంలో పేదలు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్, నోడల్ అధికారి కొల్లాబతుల కార్తీక్ ఒక ప్రకటనలో కోరారు. గురువారం ఈ మేరకు నెల్లూరులో ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇల్లు నిర్మించాలని నిర్ణయం తీసుకుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలాన్ని అందిస్తారన్నారు.