రాష్ట్ర ప్రభుత్వం, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలు ఈనెల 18న ఉదయం 10 గంటలకు స్టోన్ హౌస్ పేటలోని ఎస్ బి ఎస్ కళ్యాణమండపంలో జరుగుతాయని జిల్లా కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్చి 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు.