నెల్లూరు గ్రామీణ మండలంలోని గుండ్లపాలెంలో శనివారం దొంగతనం జరిగింది. గ్రామంలో స్థానికంగా జనార్దన్ కుటుంబం నివాసం ఉంటుంది. ఆయన వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంట్లోని బీరువా తెరచి చూడగా ఆరు సవర్ల బంగారు గొలుసు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నెల్లూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.