నెల్లూరు నగరంలోని స్థానిక మూలపేట శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి
దేవస్థానంలో పెద్ద సంఖ్యలో స్వాములు శుక్రవారం శివ దీక్షను విరమించారు. స్థానిక రంగనాయకులు స్వామి గుడి నుంచి శుక్రవారం ఉదయం ఇరుముడులు రోజులు కట్టుకొని మూలస్థానేశ్వర స్వామికి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేశారు. ఈ కార్యక్రమంలో అల్తూరు గిరీష్ రెడ్డి, టిడిపి నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.