శాంతిభద్రతలకు విఘాతం లేకుండా ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావులేకుండా ఏప్రిల్ 13న శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించాలని అదనపు ఎస్పీ సీహెచ్ సౌజన్య పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం నెల్లూరు పోలీసు కార్యాలయంలో శోభాయాత్ర నిర్వహణపై హిందూ, ముస్లిం మత పెద్దలతో ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఎవరి మనో భావాలకు ఇబ్బంది కలగకుండా సంయమనం పాటించాలన్నారు.