రీసర్వే గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్‌లో నెల్లూరు, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, సర్వేయర్లతో జేసీ సమీక్షా సమావేశం నిర్వహించారు. రీసర్వేలో రైతుల పేర్లు తప్పుగా నమోదు కావడం, విస్తీర్ణం తేడా రావడం వంటి పలు రీ సర్వేరీసర్వే సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టాలన్నారు.