నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాలలో ఆస్తి పన్ను, తాగునీటి కొళాయి పన్ను వసూళ్లను వేగవంతం చేసి నిర్దేశించిన లక్ష్యాలను 100% పూర్తి చేయాలని కమిషనర్ సూర్య తేజ ఆదేశించారు. నెల్లూరులోని 7వ డివిజన్ అరుణాచలం వారి వీధి, రైతు బజార్, జయప్రకాశ్ వీధి సచివాలయాల పరిధిలో కమిషనర్ శుక్రవారం పర్యటించారు.