రాష్ట్రంలో 35 గిరిజన ఉప తెగలకు సంబంధించి 40 లక్షల మంది గిరిజన జనాభా ఉన్నారని వారి అభివృద్ధి కోసం ఎస్టి వర్గీకరణ చేయాలని యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షుడు బాపట్ల వెంకటపతి యనాది కోరారు. ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. యానాది సంఘాల మహాకూటమి జిల్లా అధ్యక్షులు ఏకుల సుధీర్ బాబు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇండ్ల సుధాకర్ పాల్గొన్నారు.