జిల్లాలో వరి పంట కోతలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ చెప్పారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్లపై రైతు సంఘాల నాయకులు, రైతులతో జేసీ సమావేశం నిర్వహించారు.