మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని నిరసిస్తూ నెల్లూరు జాతీయ రహదారిపై ఉన్న సాక్షి ప్రధాన కార్యాలయం వద్ద తెలుగు మహిళలు సోమవారం సాయంత్రం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాక్షి ప్రతులను తగలబెట్టారు. తెలుగు మహిళ నగర అధ్యక్షురాలు రేవతి మాట్లాడుతూ మహిళల మనోభావాలను దెబ్బతీసిన సాక్షి ఛానల్ వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.