కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థను వడ్డీ వ్యాపారంగా మార్చి వేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్య అనేది మన దేశంలో ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కన్నారు. రాష్ట్రంలో వేలాది పాఠశాలలు మూసివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.