నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ పై వేంచేసియున్న వేదగిరి లక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి ) సందర్బంగా అభిషేకం, గోవింద నామ సంకీర్తనలతో గిరిప్రదక్షిణను శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి వారు ప్రత్యేక పుష్పాలంకరణ లతో భక్తులకు వైకుంఠ ద్వారం నుండి ఉత్తరద్వార దర్శనమిచ్చారు. ఈవో వేమూరి గోపి పాల్గొన్నారు.