నెల్లూరు: శ్రీవారిని దర్శించుకున్న వేమిరెడ్డి

51చూసినవారు
నెల్లూరు: శ్రీవారిని దర్శించుకున్న వేమిరెడ్డి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం విఐపి బ్రేక్ దర్శన సమయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేమిరెడ్డికి ఆలయ పండితులు తీర్థ ప్రసాద వినియోగాలు అందించి వేద ఆశీర్వచనాలు చేశారు. ఆయన మాట్లాడుతూ స్వామివారి కృపాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్