గిరిజనుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన ముత్తుకూరు మండలంలోని దొరువుల పాలెం గ్రామపంచాయతీ గిరిజన కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ సమస్యలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాల విషయంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు మల్లికార్జున యాదవ్, రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.