తాడేపల్లి లోని కేంద్ర కార్యాలయంలో వై. యస్. ఆర్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సమావేశంలో మంగళవారం నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు కాకుటూరు లక్ష్మీ సునంద, నెల్లూరు రూరల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పోతురాజు రమాదేవి, సర్వేపల్లి మహిళా అధ్యక్షురాలు పాకం సంధ్యారాణి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వీ. కళ్యాణి అరుణమ్మను ఘనంగా సత్కరించారు.