నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో, రంగనాథుని వసంతోత్సవంను బుధవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి వారికి తిరుమంజనము, విశేష పుష్పాలంకరణను అత్యంత వైభవంగా నిర్వహించారు మూడు రోజులు పాటు వసంతోత్సవాల కార్యక్రమాలు జరగనున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యల విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.