నెల్లూరు రూరల్ తహశీల్దార్‌గా టీవీఎం కృష్ణప్రసాద్ మంగళవారం నియమితులయ్యారు. ప్రస్తుతం ఇందుకూరుపేటలో పనిచేస్తున్న ఆయనను ఇక్కడికి బదిలీ చేశారు. గతంలో పనిచేసిన లాజరస్ సస్పెండ్ కావడంతో ఈ పదవి ఖాళీగా ఉంది. జిల్లాలో 22మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.