ఏపీలో ఎరుకల కులస్తులను ఇప్పటికీ దొంగలుగా చిత్రీకరిస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని జిల్లా ఎరుకల సేవా సంఘం అధ్యక్షుడు నల్లగొండ్ల శివ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నెల్లూరు ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 800 ఎరుకల కాలనీలు ఉన్నాయని తెలిపారు. ఇకపై తమను దొంగలుగా పిలిస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు.