సమ సమాజ నిర్మాణం అందరి ధ్యేయం కావాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. వెంకటాచలం అక్షర విద్యాలయలో గురువారం జరిగిన స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. దేశంలో అవినీతి, అరాచక, బేధభావం లేని సమ సమాజ నిర్మాణం అందరి లక్ష్యం కావాలని అందుకు సమిష్టిగా అందరూ కృషి చేయాలని వెంకయ్య కోరారు. మత మౌడ్యం సమాజానికి చేటు అన్నారు.