మనుబోలు మండలం బద్దేవోలు గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా అర్చకులు ఆధ్వర్యంలో శుక్రవారం విశేష పూజలు జరిగాయి. స్వామివారికి అమ్మవార్లకు పంచామృత అభిషేకం మరియు స్నపన తిరుమంజనం నిర్వహించి. అనంతరం ఉదయం ఆరుగంటల నుండి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.