నెల్లూరు జిల్లాలో తప్పిన పెను ప్రమాదం

69చూసినవారు
నెల్లూరు జిల్లాలో తప్పిన పెను ప్రమాదం
సర్వేపల్లి మండలంలోని కొండూరుసత్రం వద్ద జాతీయ రహదారిపై గురువారం కంటైనర్ లారీ అదుపుతప్పి కారును ఢీకొనడంతో దుర్ఘటన జరిగింది. తిరుపతి జిల్లా పోలీస్ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్, ఎస్పీ సుబ్రహ్మణ్యం విజయవాడకు వెళ్తుండగా, వెనుక నుండి వేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టింది. డ్రైవర్ రవికుమార్ చాకచక్యంతో కారును అదుపులో పెట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్