సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన 19 మంది బాధితులకు రూ. 19. 10 లక్షల విలువైన చెక్కులను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు ఆర్థిక సాయం మంజూరు చేయించిన సోమిరెడ్డికి తమ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల వైద్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకుంటుందని పేర్కొన్నారు.