పొదలకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జనసేన మండల ఇంచార్జ్ దాసినేటి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన జిల్లా నాయకులు నూనె మల్లికార్జున్ యాదవ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన సర్వేపల్లి ఇంచార్జ్ సురేష్ నాయుడు మాట్లాడుతూ రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పాత్ర కీలకం కానుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జనసేన ముందుంటుందన్నారు.