మనుబోలు: పిల్లలకు ఆరు నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలి

60చూసినవారు
మనుబోలు: పిల్లలకు ఆరు నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలి
మనుబోలు మండలం బద్దెవోలు క్రాస్ రోడ్డు లోని సంగమేశ్వర గిరిజన కాలనీలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం పౌష్టికాహార పక్షోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీడీపీఓ విజయలక్ష్మి మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలకు పోషకాహారం యొక్క విశిష్టతను వివరించారు. అలాగే పిల్లలకి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని తెలిపారు. బాల్య వివాహాలు చేయొద్దని తెలిపి, అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్