మనుబోలు: ప్రభుత్వం మద్దతు ధర కంటే తక్కువ విక్రయించవద్దు

61చూసినవారు
మనుబోలు: ప్రభుత్వం మద్దతు ధర కంటే తక్కువ విక్రయించవద్దు
రైతులు ప్రభుత్వం మద్దతు ధర కంటే తక్కువకు విక్రయించవద్దని మనుబోలు మండలం ప్రత్యేక అధికారి సుబ్బారెడ్డి తెలిపారు. మంగళవారం మనుబోలు ఎంపీడీవో కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. వరి కోత దశకు వచ్చి ఉన్నందున రైతులు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ ధరకు విక్రయించవద్దన్నారు. మనుబోలు మండలంలో 15 వేల ఎకరాలు వరి సాగు చేస్తున్నారని, రైతులు ప్రభుత్వ సూచనలు పాటించి దానికి అనుగుణంగా ధాన్యం అమ్మాలని కోరారు.

సంబంధిత పోస్ట్