మనుబోలు మండలంలోని మనుబోలు, చెర్లోపల్లి, జట్ల కొండూరు, కాగితాల పూరు గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది బుధవారం చెత్త సేకరణ కార్యక్రమం చేపట్టారు. గడపగడపకు వెళ్లి తడి చెత్త పొడి చెత్తను సేకరించారు. ప్రతి ఒక్కరు గ్రామంతో పాటు రాష్ట్రాల శుభ్రంగా ఉంచుకునేందుకు కృషి చేయాలని పంచాయతీ సిబ్బంది తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరారు.