మనుబోలు మండలం కాగితాలపూరులో శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ అంకమ్మ తల్లి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో శుక్రవారం సర్వేపల్లి తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన సతీమణి శృతి రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల ఆశీస్సులతో ఇంటింటికీ వెళ్లే కార్యక్రమం చేపట్టామని, గడప గడపకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నామని సోమిరెడ్డి తెలిపారు.