మనుబోలు: హోసింగ్ లో 60లక్షల అవినీతి.. అధికారులపై వేటు

80చూసినవారు
మనుబోలు: హోసింగ్ లో 60లక్షల అవినీతి.. అధికారులపై వేటు
హౌసింగ్ శాఖలో రూ. 60 లక్షల అవినీతికి పాల్పడిన ముగ్గురిపై కలెక్టర్ ఆనంద్ గురువారం వేటు వేశారు. 2019-24 మధ్య కాలంలో మనుబోలు మండలంలో పాత ఇళ్లకు ఇసుక, సిమెంట్, స్టీలు సరఫరాలో భారీగా అవినీతి జరిగినట్లు పలువురు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు విచారణ చేసి దాదాపు రూ. 60 లక్షల మేర అవినీతి జరిగినట్లు తేల్చారు. దీంతో ఏఈతో పాటు ఇద్దరు ఇంజినీరింగ్ అసిస్టెంట్లపై వేటు పడింది.

సంబంధిత పోస్ట్