మనుబోలు మండలం, వీరంపల్లి గ్రామపంచాయతీలో లింగారెడ్డిపల్లి గ్రామంలోని గిరిజనుల ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్ పై ఏఈ శరత్ బాబు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇళ్ల నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని సక్రమంగా నిర్మించలేదన్నారు. ఇదే విషయంపై లక్షల్లో అవినీతి జరిగిందని స్థానికులు ఆరోపించారు. విచారణ చేయాలని హౌసింగ్ శాఖ ఫిర్యాదు చేసింది.