మనుబోలు: అకాల వర్షం వల్ల రైతులు నష్టపోయారు

51చూసినవారు
మనుబోలు: అకాల వర్షం వల్ల రైతులు నష్టపోయారు
నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాలతో పాటు మనుబోలు మండలంలో కూడా శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎండడానికి ఆరబోసిన వడ్లు వర్షానికి తడిసిపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఊహించని వర్షం తమను నష్టానికి గురిచేసిందని ఆవేదన చెందారు. పంట సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా రాకపోగా ఈ వర్షం మరింత దుఃఖాన్ని మిగిల్చింది.

సంబంధిత పోస్ట్