మనుబోలు మండలం చేరెడ్డివారి తోట సమీపంలో ఆదివారం రాత్రి ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఓజిలి మండలం పినపరియపాడు గ్రామానికి చెందిన కటిన గోపాలకృష్ణ(30) నెల్లూరులోని భార్య వద్దకు బయలుదేరాడు. చేరెడ్డివారి తోట వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి రైలింగ్ ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో రక్తస్రావమై అతను మృతి చెందాడు.