నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలం వ్యవసాయ అధికారి జహీర్ ను కలిగిరి మండలానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో విడవలూరు మండలం వ్యవసాయ అధికారిగా పని చేస్తున్న వెంకట కృష్ణయ్యను నియమించారు. వెంకట కృష్ణయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అలాగే మనుబోలు ఏఈఓగా పనిచేస్తున్న కళారాణిని మనుబోలు మండలంలోని అక్కంపేట ఏఈఓగా బదిలీ చేశారు.