మనుబోలు మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 20న ఎంపీపీ వజ్రమ్మ అధ్యక్షతన నిర్వహిస్తున్నామని ఎంపీడీవో జలజాక్షి తెలిపారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆమె మాట్లాడారు. ఉదయం 11 గంటలకు సభ్యులు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ హాజరు కావాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ పథకాలపై సమీక్ష నీటిపారుదుల శాఖ పనులపై సమీక్ష పశువర్ధక శాఖ మత్స్య శాఖలో జరిగే పథకాలపై సమీక్ష జరుగుతుందన్నారు.