వ్యవసాయ కూలీ పనులు లేనందున ఉపాధి హామీ పనులు చూపించాలని మనుబోలు అరుంధతి వాడ వాసులు కోరారు. మనుబోలు మండల ఉపాధి హామీ కార్యాలయంలో ఏపీవో రాజమ్మకు మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఆమె మాట్లాడుతూ జాబ్ కార్డు ఉన్న వారందరికీ ఉపాధి హామీ పనులు కల్పిస్తామన్నారు. వేసవి అలవెన్స్ కలిపి వేతనం 300 రూపాయలు గిట్టుబాటు అవుతుందన్నారు. కొలతలు ప్రకారం పని చేస్తే వేతనం వస్తుందన్నారు.