నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చుట్టుపక్కల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. అలాగే భక్తుల కొరకు ఆలయ నిర్వహకులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శనివారం కావడంతో భక్తులతో ఆలయం కిటకిటలాడింది.