మనుబోలు మండలం జట్ల కొండూరులోని ఎలిమెంటరీ పాఠశాలను మరొక గ్రామానికి తరలించవద్దని గ్రామస్థులు సోమవారం ఎంఈఓ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అనంతరం వినతి పత్రం అందించారు. జీవో నెంబర్ 117ను రద్దు చేసి మూడు కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలను ఒక చోట చేర్చి మోడల్ స్కూల్ అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా గ్రామంలోని పాఠశాలను తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.