ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు ప్రశ్నించినా కేసులు పెడతారా అంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజితమ్మ ప్రశ్నించారు. మనుబోలు మండలంలో గురువారం ఆమె పర్యటించారు. మహానేత వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూజితమ్మను కలవడానికి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పోటీపడ్డారు. ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రస్తావించినందుకే కాకాని పై అక్రమ కేసులు బనాయించారన్నారు.