మనుబోలు: వైష్ణాలయంలో తొలి ఏకాదశి పురస్కరించుకొని పూజలు

166చూసినవారు
మనుబోలు: వైష్ణాలయంలో తొలి ఏకాదశి పురస్కరించుకొని పూజలు
మనుబోలు మండల కేంద్రంలోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వైష్ణాలయంలో తొలి ఏకాదశి పురస్కరించుకొని ఆదివారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు హనుమా చార్యులు స్వామి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి సుప్రభాత సేవ చేసి క్షీర పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలతో అలంకరించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని సేవలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్