సముద్రంలో వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. ముత్తుకూరు బీసీ కాలనీకి చెందిన తిరుపతి రావు (42) సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ప్రమాదవశాత్తు బోటులో నుంచి జారి సముద్రంలో పడగా. తోటి మత్స్యకారులు గుర్తించి వెలికి తీశారు. అప్పటికే తిరుపతిరావు మృతి చెందారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.