విష గుళికలు తిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముత్తుకూరు మండలం పంటపాలే నికి చెందిన శ్రీనివాసులు (45) మంగళవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే, సోమవారం మద్యం తాగి ఇంటికి రావడంతో భార్యాభర్తల మధ్య వివాదం జరిగింది. దీంతో శ్రీనివాసులు విష గుళికలు తీసుకోగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం శ్రీనివాసులు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.