ఏపీ జెన్కో థర్మల్ కేంద్రం కాంట్రాక్టు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రాజెక్టు జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. గురువారం జేఏసీ ఆధ్వర్యంలో ప్రాజెక్టు వద్ద నిరసన కార్యక్రమం కొనసాగింది. వినూత్న రీతిలో మోకాళ్లపై కార్మికులను నిల్చొని తమ డిమాండ్లు సాధనకై పోరాటం చేశారు. కార్మికులను మ్యాన్ పవర్ గా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.