తన భర్త కత్తి చంద్రయ్య అదృశ్యంపై భార్య ప్రసన్న శుక్రవారం కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసామని స్థానిక ఎస్సై జెపి శ్రీనివాసరెడ్డి విలేకరులకు తెలియజేసినారు. భర్త ఏ పనికి వెళ్లడం లేదని భార్య ప్రసన్న ప్రశ్నించినందుకు ఆర్థిక పరమైన సమస్యలు మూలంగా ఈనెల 23న ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు భార్య ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు.