అక్రమ మైనింగ్ కేసులో రిమాండులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై గురువారం ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ ఇన్చార్జి కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ఆయన తరపున న్యాయవాదులు వాదనలు వినిపించగా ప్రాసిక్యూషన్ తరపున ప్రత్యేక పీపీ నేడు వాదనలు వినిపించనున్నారు. కాగా ప్రాసిక్యూషన్ అభ్యర్థన మేరకు ఈ విచారణ నేటికీ వాయిదా వేశారు.