గత పాలకుల అరాచకంతో మూసేసిన స్కూల్ ను ఓపెన్ చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఒకే రోజులో 900 మందికి అడ్మిషన్లు ఇవ్వడం సరికొత్త రికార్డు అని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పనితీరు పట్ల సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనియాడారు. ఆదివారం రాత్రి నెల్లూరు వీఆర్ హై స్కూల్ ను మంత్రి నారాయణతో కలిసి ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.