మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో 14 రోజుల రిమాండ్ ను పొడిగిస్తూ నెల్లూరులోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం నిర్ణయం తీసుకుంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది. మూడు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో పోలీసులు ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టారు. బెయిల్ మంజూరు చేయాలని కాకాణి తరపు న్యాయవాదులు కోరగా న్యాయమూర్తి తోసిపుచ్చారు.