శ్రీ వెంకయ్య స్వామి ఆశీస్సులతో సర్వేపల్లి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తోటపల్లి గూడూరు మండలంలోని వరిగొండ గ్రామంలో ఆదివారం గురు పౌర్ణమి వేడుకల సందర్భంగా శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాలను స్వామివారి భక్తుడు శ్రీ మోహన్ స్వామి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన విచ్చేసినారు.